Monday, November 18, 2013

విన్నపం

మిత్రులకు, శ్రేయోభిలాషులకూ, తెలుగు మీద అభిమాన౦ ఉన్న అ౦దరికీ ఒక శుభవార్త - ఇంకా ఓ విన్నప౦.

కొత్తపల్లి పిల్లల మాసపత్రిక సెప్టెంబర్ 2013 ను౦డి రాలేదు.  ఇప్పుడు మళ్ళీ జనవరి 2014 నుండి ముద్రించబోతున్నట్లుగా కొత్తపల్లి వారు అందరికీ తెలియబరుస్తున్నారు.   kottapalli.in  కి వెళ్ళి ఇప్పటి వరకూ వచ్చిన 62  సంచికల్లో పిల్లలు, పెద్దలు రాసిన కథలు చదవండి.  రాబోయే కథలు చదవండి.  మీ పిల్లలకు చదివి వినిపించండి. మీరూ కథలు రాయండి.  మీ పిల్లల చేత కథలు రాయించి కొత్తపల్లికి పంపండి.

ఈ పత్రిక ఇక ఆగకుండా కొనసాగాలంటే మనమందరం చందాలు (Rs.300/-) కట్టాలి.  డొనేషన్స్ ఇవ్వాలి.

*  ఒక సంచిక (2000 కాపీలు) ముద్రించాలంటే దాదాపు Rs.33000/- ఖర్చు అవుతుంది.  మీ పిల్లల పుట్టిన రోజునో, మీ పెళ్ళి రోజునో,  ఏదో ఒక ముఖ్యమైన రోజు డొనేషన్ ఇచ్చి మీ పేరు మీద ఒక సంచికని ప్రచురించడానికి సహాయం చేయవచ్చు.

* 12 సంచికలూ కలిసిన పాత సంవత్సరపు సంచికల సెట్స్ (సెట్ - Rs.300/-)  మీకు కావలసినన్ని కొని ఇంట్లోని మన పెద్ద వారి పేరు మీద స్నేహితులకీ, చుట్టాలకీ బహుమతులుగా ఇవ్వవచ్చు.

ఇలా ఏదో విధంగా కొత్తపల్లికి అందరం సహాయం చేద్దాం.  ఈ పిల్లల పత్రికని నిలబెడదాం.  ఇలాంటి పత్రికలు కలకాలం కొనసాగాలంటే అందరి సహకారం ఉండాలన్న సంగతి మీకు తెలిసిందే కదా!

కొత్తపల్లి శ్రేయోభిలాషిగా నేను చేస్తున్న ఈ విన్నపాన్ని మన్నించి  కొత్తపల్లికి తోడ్పడండి. (కొత్తపల్లి వారి A/c వివరాలు క్రింది లింక్ లో ఉన్నాయి)

నమస్కారం
రాధ
http://blog.kottapalli.in/2013/03/blog-post.html

No comments:

Post a Comment

P