Monday, November 11, 2013

అదే నేను



రచన : మండువ రాధ



(ఈ కవిత ఈమాట పత్రికలో ప్రచురించబడింది)


పెను చీకటికవతల
ఏముందో తెలుసుకోవాలనీ
ఆది అంతాలను గ్రహించాలనీ
జనన మరణాల
రహస్యాన్ని ఛేదించాలనీ
నేను అనుకుంటుంటే,


రేయి లేదు
పగలు లేదు
మొదలు చివరలసలే లేవు
ఆఖరికి
చావు బ్రతుకులు కూడా
లేవని నీవంటావు.


మరి ఉన్నదేమిటయ్యా అంటే
ఉన్నదంతా ‘నువ్వే’ నంటావు
‘నేనా’ అని ఆశ్చర్యపోతుంటే
దొంగలా నవ్వుతూ
నా కళ్ళలోకి చూస్తావు
నా లోలోపల దాక్కొని
‘అదే నేను’
నన్ను వెతుకు అంటావు.

No comments:

Post a Comment

P