Wednesday, April 2, 2014

ఊటబావి మనసు

                                           

                                                                                రాధ మండువ

నిర్జన నదీతీర
ఒంటరి కుటీరానికి
వెళ్ళాలని ఉంది

ఊహాజగత్తులో రమ్యహర్మా్యలను
నిర్మించాలని కాదు
దూర తీరాలతో
నాకు నిమిత్తమూ లేదు

నాలోని అస్తవ్యస్త భావాలన్నింటినీ
ఒకచోట చేర్చి చూసుకోడానికీ
నాలో ఉన్న ఎత్తు పల్లాలను
చదును చేసుకోవడానికీ
మీద పడుతున్న దాహపు కోరికల
అలల తీరాన్ని కనుగొనడానికీ
వెళ్ళాలి -

ఒక్కసారి ఆగి
నన్ను నేను
సంభాళించుకోవాలి
సాంత్వన పొందాలి

కాని అదేమిటో

బంధాల అనుబంధాల చటా్రల్లో
భ్రాంతుల వలయాల్లో
గతకాలపు జ్ఞాపకాల్లో చిక్కుకుని
చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ
ఇక్కడిక్కడే ఊరుతోంది
ఊటబావి మనసు


***

No comments:

Post a Comment

P