Saturday, April 5, 2014

నిజం కదా....


నిజం కదా....

రాధ రాజశేఖర్ఎదుటి వ్యక్తి మనసులోంచి
సూటిగా తాకిన అభినందన
'చేతన' ని కుదుపుతుంది

ఎడతెగకుండా మాట్లాడుతున్న
విదూషకుడు హఠాత్తుగా
మౌనం వహిస్తాడు

క్షణాల్లోంచి వింత వింత సుమాలు పూస్తాయి
శరీరం ఎవరిదో అన్నట్లుగా ఉంటుంది

'నా' గురించి ఏవో వివరాలు అడుగుతున్న స్వరం
ఎప్పుడూ మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది

ముగించుకుని వెళ్ళాల్సిన వాడిని
పెంచుకుని వెళుతున్నానన్న ఆశ్చర్యం
ఆనందంగా మారుతూ ఉంటుంది

ఒక్క మనిషి చూపించిన అభిమానం
దిగంతాలు దాటి జగమంతా విస్తరిస్తుంది

మనుషుల మీద నమ్మకం
మరోసారి మల్లెపువ్వులా గుబాళిస్తుంది


***
2 comments:

P