Saturday, May 31, 2014

అపుత్రస్య గతిర్నాస్తి - చిట్టి కథ


మండువ వారి పాలెంలో తిరుపాలు, శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు పట్టణం మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకుని కావిడిలో వేసుకుని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముకునేవారు.

ప్రతిరోజూ ఉదయం తిరుపాలు శాంతమ్మ పెట్టిన చద్దన్నం తిని ప్రక్కనే ఉన్న పట్టణం మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చేవాడు. ఈలోగా శాంతమ్మ తను కూడా ఇంత తిని ఇంటి పనంతా చేసుకుని మధ్యాహ్నానికి అన్నం వండి రెండు డబ్బాల్లో సర్ది ఉంచేది.

తిరుపాలు రాగానే కూరలు కావిడి బుట్టల్లో సర్దుకుని ఇద్దరూ ఊరూరా తిరిగి అమ్మేవారు. మధ్యాహ్నం అన్నం ఏ చెట్టుకిందో, ఏ రైతు ఇంట్లోనో తినేవారు. సాయంత్రానికి ఇంటికొచ్చి త్వరత్వరగా పొయ్యి వెలిగించి అన్నం వండేది శాంతమ్మ. అన్నం, కూర ఉడికే లోపు పొంతలో నీళ్ళు సలసలా కాగేవి. ఇద్దరూ ఉడుకుడుగ్గా స్నానం చేసి అన్నం తినేవారు.

రాత్రి భోజనం కాగానే తిరుపాలు గుడిలో పురాణం వినడానికి వెళ్ళేవాడు. శాంతమ్మ ఇంట్లో మిగిలిన పని పూర్తి చేసుకుని పక్కలు పరిచి నడుం వాల్చేది. పురాణం విని వచ్చిన తిరుపాలు తను కూడా పడుకుని భార్యకి పురాణం కథని తనకి అర్థం అయిన రీతిలో చెప్పేవాడు.

ఇలా ప్రశాంతంగా జీవితాన్ని సాగించే ఆ దంపతులకు పిల్లలు లేరు. అయితే వారెప్పుడూ దాని గురించి చింతించలేదు. అసలు ఆలోచించడానికి కూడా వారికి సమయం ఉండేది కాదు.

ఒకరోజు పురాణం విని వచ్చిన తిరుపాలు చాలా విచారంగా నిట్టూరుస్తూ పక్క మీద కూర్చున్నాడు. శాంతమ్మ పడుకున్నదల్లా లేచి కూర్చుని "ఏం జరిగింది? ఎందుకు దిగులుగా కనిపిస్తున్నావు?" అంది ఆందోళనగా.

"ఈరోజు పంతులు గారు పురాణం చెప్తూ 'అపుత్రస్య గతిర్నాస్తి' అన్నారు" అన్నాడు తిరుపాలు రుద్ధమైన కంఠంతో.

"అంటే ఏమిటి?" అంది శాంతమ్మ కంగారుగా - అదేదో పెద్ద ఆపదేమో అనుకుని.

"పిల్లలు లేకపోతే - అందునా మగపిల్లలు లేకపోతే గతులుండవంట" అన్నాడు తిరుపాలు బాధగా.

ఇదంతా పిల్లలు లేరని వంకతో మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి కొంత మంది పెట్టిన సూక్తుల గోల అని అర్థం చేసుకున్న శాంతమ్మ తేలికపడుతూ "ఏం గతులూ?" అంది నిరసనగా చేతులు వెల్లకిలా విరగదీస్తూ.

"ఏమోనే - పుట్టగతులేమో!" అన్నాడు తిరుపాలు.

"మరీ మంచిది. ఎక్కడెక్కడివారో, ఎంత జ్ఞానవంతులో సంసారాలను వదిలి పుట్టగతులు ఉండకూడదని తపస్సులు చేస్తున్నారు. మనకి ఏం చేయకుండానే పుట్టగతులుండకపోతే మంచిదేలే - పడుకో - తెల్లారి మార్కెట్ కి పోవాలి" అంది స్తిమితంగా.

స్వర్గగతులని తిరుపాలు అని ఉంటే శాంతమ్మ ఏమని సమాధానం చెప్పేదో మరి..... కథ గ్రూప్ మిత్రులందరూ ఊహించి తలా ఒక మాట చెప్తారా? - మీ రాధ



****



Like · · Share

Chaitu Voluntary Voice, Nagalakshmi Varanasi, Sireesha Sribhashyam and 12 otherslike this.

1 share




Vijaya Karra "వుందో లేదో తెలియని స్వర్గం గురించి దిగులు పడుతూ - వున్న జీవితం పాడు చేసుకుంటామేమిటీ? - పడుకో హాయిగా! - తెల్లారి మార్కెట్ కి పోవాలి" అంది స్తిమితంగా.

May 27 at 9:06am · Unlike · 5



Padmakar Daggumati నేనలా అనుకోలేదు దాన్ని! "అపుత్రస్య గతిర్నాస్తి" అంటే, కుటుంబ వ్యవస్థలో ఆనాడు వయసు పైబడ్డాక పుత్రుడి మీదే కదా ఆధార పడాల్సింది, వాడు పుట్టకపోతే ఆ వయసులో తల్లిదండ్రులకు గతి ఉండదు. (దిక్కు ఉండదు, ముద్ద దిగదు!)

May 27 at 10:24am · Unlike · 1



Radha Manduva అవునండీ!!! భలే చెప్పారు. చెప్తూ 'పుత్రుడు' లు బాధ పడటమెందుకు?
May 27 at 1:18pm · Like · 1


Padmakar Daggumati అది తిరుపాలు బొమ్మ!

May 27 at 1:26pm · Like


Radha Manduva విరగబడి నవ్వినట్లు ఏదైనా బొమ్ముందా ఫ్రెండ్స్
May 27 at 1:27pm · Edited · Like · 1

Bhanumathi Mantha idigO


No comments:

Post a Comment

P