Thursday, May 14, 2015

ఒప్పుకోలు

కినిగెలో ప్రచురితమైన కథ - మా అబ్బాయి గౌతమ్ ఇంగ్లీషులో రాస్తే తెలుగులోకి అనువదించాను. చదవండి ఫ్రెండ్స్.. కినిగేలో ప్రచురించేప్పుడు ఈ ముందు భాగాన్ని ఎడిట్ చేశారు. ఇది కూడా కలిపి చదువుతారని .....


ఈరోజు పొద్దున్నే టా్రన్స్ ఫర్ ఆర్డర్ అందుకున్నాను. కాంగోకి వెళ్ళమని నన్ను ఆదేశిస్తూ మా ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఉత్తరం నా చేతిలో నలుగుతోంది. ఆ దేశానికి వెళ్ళడం ఇష్టం లేదని కాదు - కొత్త అనుభవాలు వెతుక్కోవాలనీ, రకరకాల ప్రదేశాలని చూడాలనీ తపన పడే కుర్రతనపు అంశ నాలో ఇంకా మిగిలే ఉంది - అయితే నా భార్య మాత్రం సిడ్నీ నుంచి కదలడానికి 'ససేమిరా' అంటోంది. మా అబ్బాయి జేమీని నాతో తీసుకెళ్ళే షరతు మీద ప్రపంచంలో ఏ దేశానికైనా నేను వెళ్ళడానికి నాకు అనుమతిని దయతో ప్రసాదించింది.

ఇది చాలా అన్యాయం మార్గరెట్" అన్నాను బాధతో "ఐదేళ్ళ పిల్లవాడిని కాంగో తీసుకెళ్ళడమా? అక్కడ ఏ పాము కాటు బారినో పడితే!!?”

సరేలే... అపశకునపు మాటలు మాట్లాడకండి. ఆఫ్రికా నిండా పాములున్నట్లు... ఇదేం సినిమా కాదు. అసలే మనం వాడిని సెలవలకి బయటకెక్కడికీ తీసికెళ్ళడం లేదని గోల చేస్తుంటాడు. మీరు దీన్ని హాలిడే టి్రప్ కింద చేసేశారంటే వాడి కోరికా తీరుతుంది, ఖర్చు కూడా తప్పుతుంది" అంది.

చాలా సేపు వాదన జరిగాక యధాప్రకారం ఓడిపోయిన నేను 'ఆడవాళ్ళు ఎంత గడుసువాళ్ళో' అని గొణుక్కుంటూ జేమీ రూమ్ లోకి వెళ్ళాను. నిజానికిది వాడి నిద్ర టైమ్ కాని మా మధ్య జరుగుతున్న మాటల వల్ల అనుకుంటా వాడు నిద్రపోలేదు. కళ్ళు విప్పార్చుకుని కప్పు వంక చూస్తూ పడుకుని ఉన్నాడు.

మా అబ్బాయి నాలా పొడగరి. విషయాలను చాలా తొందరగా గ్రహిస్తాడు. మా సంభాషణ మొత్తం విన్నట్లే ఉన్నాడు.

డాడీ" అన్నాడు నన్ను చూడగానే.

ఏం నాన్నా? ఇంకా నిద్రపోలేదా?” అంటూ దగ్గరగా వెళ్ళాను.

మనం ఆఫ్రికా వెళుతున్నాం కదా!”

అవును బాబూ - అక్కడున్న పులులూ, సింహాలూ చూద్దాం. ఇంకా......”

ఇది నీ ఆఫీస్ టి్రప్ కదా డాడీ" నవ్వాడు.

అయినా ఆదివారాలు ఇంట్లోనే ఉంటాంగా అప్పుడు అవన్నీ చూద్దాం సరేనా. ఇక నిద్రపో, గుడ్ నైట్" అన్నాను వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని.

గుడ్ నైట్ డాడీ" అన్నాడు జేమీ ఆనందంగా.

********   తర్వాత కథని ఈ లింక్ లో చదువుకోగలరు  ********    మీ రాధ మండువ

No comments:

Post a Comment

P