Wednesday, January 28, 2015

వేణువు

రాధ మండువ
********************

నీలివర్ణ హృదయాచ్ఛాదనపై
నవ్వు సహజ ధవళ వర్ణమై వాలినపుడు
సిద్ధాంత రాద్ధాంతాలన్నీ మాయమవుతాయి
శరీరంలో దాగున్న శక్తేదే కళ్ళల్లోకొస్తుంది
నిన్ను పట్టుకున్న వేళ్ళ చివర్లల్లో
ప్రాణం చేరి వణుకుతుంది

నీ నుంచి విడివడి నడిచి వెళుతూ
అగాధాల గుర్తులు నీలో వదిలి వెళతాను

నీకే తెలుసు....
మృణ్మయ వర్ణ మనసు పొదల్లో నేను ఊదుతున్న
వేణువుని వింటూ వాటిని పూడ్చుకోవడం
నీ ఎడద మలుపుల్లో ఉన్న శ్వేతకాంతిని నింపి
వేదనని తీయగా మార్చుకోవడం

****
ఉషారాణి గారి ఫోటోని చూసి రాసుకున్న కవిత. ఆమెకి ధన్యవాదాలు.

No comments:

Post a Comment

P