Wednesday, February 4, 2015

అవునే తానే నన్నేనే

ఒకే కుటుంబం సినిమా కోసం దేవులపల్లి రచించి కోదండపాణి సంగీతం సమకూర్చిన పాట "అవునే తానే నన్నేనే" చాలా మంచి పాట. శివాజీ గణేశన్, ఎమ్ ఆర్ రాధ నటించిన 'పావమన్నిప్పు' అనే సినిమాకి రీమేక్ ఇది. (నాగభూషణం, రామారావు ప్రధానపాత్రలుగా నటించిన సినిమా) ఈ పాటకి తమిళ మాతృక "అత్తాన్ ఎన్నత్తాన్" అనే పాట. ఆసక్తి ఉంటే ఆ పాట కూడా వినండి. అది కూడా చాలా గొప్ప పాట.

ఇంకో విషయం ఏమిటంటే పావమన్నిపు్ప సినిమాని తెలుగులో "పాపపరిహారం" పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. ఆ డబ్బింగ్ సినిమాలో ఈ పాట "చిలకా ఓ చిలకా" అనే పల్లవితో ఉంటుంది. ఈ పాట వింటుంటే ట్యూనుకి మాటలు కిట్టించినట్లు తెలిసిపోతుంది. కాని ఈ "అవునే తానే" పాట వింటే సమర్థుడైన కవి ట్యూను కోసం రాస్తూ కూడా మాతృకలో ఉన్న భావాన్ని తెలుగులోకి ఎంత అద్భుతంగా తేగలడో అవగతమవుతుంది.

- రాధ రాజశేఖర్


https://www.youtube.com/watch?v=51CDmuvPrJI&list=PLD8J0-


తమిళ పాటకి లింక్
https://www.youtube.com/watch?v=J6a8_HC7gz4


No comments:

Post a Comment

P