Wednesday, February 4, 2015

సారంగ రాగం

సారంగ రాగం - ఒకసారి వింటే విడవకుండా మనసుని హాంట్ చేసే రాగాలలో సారంగ ఒకటి. ఈ రాగంలో సినిమా పాటలు ఎక్కువ ఉన్నట్లు తోచదు. చాలా మందికి తెలిసిన ఒక పాట 'నా ఇల్లు' సినిమాలో నాగయ్య గారు స్వరపరచిన "అదిగదిగో గగనసీమ" (రచన - దేవులపల్లి). త్యాగరాజస్వామి రచించిన 'నౌకాచరిత్రము' అనే నృత్యనాటికలో ఉన్న "ఓడను నడిపే ముచ్చటకనరే వనితలారా నేడు" అనే కీర్తనని బాపు తీసిన త్యాగయ్య సినిమాలో ఎస్ జానకి చేత పాడించారు - ఇది కూడా ప్రసిద్ధమైనదే.

ఈ రాగం ధ్వనించే ఇంకొక పాట - ఘంటసాల స్వీయ సంగీత సారధ్యంలో విజయా వారి 'చంద్రహారం' సినిమా కోసం పాడిన "విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్యా, అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా" అనేది. ఈ సినిమా ఫ్లాప్ అవడం వలన ఈ పాట అంత ప్రాచుర్యంలోకి వచ్చినట్లు లేదు. ఈ పాట సినిమా మొదట్లో టైటిల్స్ వేసేటప్పుడే వస్తుంది కాబట్టి యు ట్యూబ్ లో సినిమాలోనే వినండి ఫ్రెండ్స్.... ఈ సినిమా కోసం ఘంటసాల గారికి ఆర్కెస్ట్రాలో సహాయపడింది మాష్టర్ వేణు గారు, అవధానం కృష్ణమూర్తి గారు (విజయా కృష్ణమూర్తిగా ప్రసిద్ధులు). (ఓడను నడిపే పాట లింక్, అదిగదిగో గగనసీమ లింక్ కామెంట్ లో ఉన్నాయి చూడండి)


- రాధ రాజశేఖర్
https://www.youtube.com/watch?v=QsQp5-AZeGo

నాకు చాలా ఇష్టమైన పాట - "ఓడను నడిపే ముచ్చట గనరే"  లింక్ https://www.youtube.com/watch?v=QfINnSsg_PM

No comments:

Post a Comment

P