Friday, April 3, 2015

కృష్ణాజీ

(దయచేసి గమనించండి - ప్లీజ్ - కృష్ణాజీ భావాన్ని నేను నా మాటలతో చెప్పాను. ఆఖరి పేరాలో... ఇవే మాటలు ఆయన వేరే రకంగా ఎక్కడైనా అనే ఉంటారేమో మరి)
- రాధ రాజశేఖర్
***********


వర్షం పడుతోంది రిషీవ్యాలీలో. ఎప్పుడో తెల్లవారు ఝామున రహస్యంగా ప్రారంభమయింది ఈ వాన. కాసేపు కురిసీ కురవనట్లు, కాసేపు బలంగా చప్పుడు చేస్తూ, అంతలోనే మందగిస్తూ - మట్టి వాసనని రేపుతూ. కృష్ణాజీని గుర్తుకు తెస్తూ...

నేను చూస్తున్నాను - అది గుసగుసలు పోతుంటే అంతకంటే గుప్తంగా దాక్కుని, హోరెత్తుతుంటే ఎగిరి గంతులు వేసుకుంటూ.

ఇలా రహస్యంగా కురుస్తున్న వానలా - అప్పుడప్పుడూ గుసగుసగా మళ్ళీ కాసేపటికే పెద్దగా - మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, గంతులు వేసుకుంటూ ఉంటే - ముఖ్యంగా రాత్రుళ్ళు - నన్ను ఎలాంటి so called worldly standards ప్రకారం చూసినా పిచ్చిది అనుకోవడం ఖాయం. మరీ ఒంటరిగా ఎవరూ లేకుండా ఉన్నప్పుడు ఈ పిచ్చి మరింత స్పష్టంగా తెలుస్తుంది.

నాకో సందేహం - ఇన్ని తెలుగు పత్రికలు ఢంకా, నవోదయ, రూపరాణి, తెలుగు స్వతంత్ర, వీణ - ఇక భారతి, పత్రిక, ప్రభ ఎలానూ ప్రసిద్ధమే - 1930 నుంచీ కనీసం 60 ల దాకా ఇంత మేధోపరమైన సాంస్కృతికం వెల్లివిరిసింది. తెలుగులో ఒక్కళ్ళూ జిడ్డు కృష్ణమూర్తిని ఎందుకు పట్టించుకోలేదన్న ఆశ్చర్యం. 'The man who refused to play God' అని 1930 ల్లోనే ప్రపంచమంతా అబ్బురపడిన ఆయన గురించి News value item గా నన్నా కూడా ఎవరూ రాయకపోవడమేమిటో!

ఇదిగో ఈ రాయడం గురించి తల్చుకుంటే గుబులు, అసంతృప్తి - ఇరవై ఏళ్ళ క్రితం నుండే రాసుకోకపోతినే అని.

తెల్లని బట్టలతో మోకాళ్ళ వరకూ ఉన్న చేతులతో అందంగా రూపు దిద్దుకున్న ఓ ఆకారం సన్నగా నవ్వి అంటోంది "ఎంత రాసినా, చదివినా, ధనం, పేరు సంపాదించినా చివరికి ఒక సుఖమైన స్థితి ఎప్పటికీ continue అవుతూ ఉండే "కాలం" రావాలని ఆశ మనసుకి. ఈ process లో ప్రస్తుత క్షణాన్ని పారబోస్తూ ఉంటుంది" అని.

మా్రన్పడిపోయి "ఆఁ" అన్నాను - అంతే -

వర్షం ఆగింది.

*****

No comments:

Post a Comment

P