Tuesday, June 16, 2015

నా అక్షరం

- రాధ మండువ 


భావోద్వేగంతో మనసుని తడిమే ప్రతి అక్షరాన్నీ నేను తాకగలను. మనసు పొరల్లో జరుగుతున్న సంచలనాన్ని తన రూపంలోకి తర్జుమా చేయడానికి తటపటాయిస్తున్న అక్షరాల సముదాయాన్నీ గమనించగలను; కలకలం, కలవరం లేకుండా మౌనంగా నాలోకి ప్రవహిస్తున్న తనని నేను గుర్తుపట్టి కౌగలించుకోగలను. పూల పరిమళంలా నన్ను చుట్టుకుంటున్న నా అక్షరాన్ని ఆప్యాయంగా అందుకుని జడలో అలంకరించుకోనూగలను.

'నాకు మాత్రమే' అర్థమయ్యే దానిని 'నేను మాత్రమే' అనుభూతించగలను.

2 comments:

P