Monday, November 11, 2013

రెండో జన్మ



కవిత  

రెండో జన్మ  



అన్ని గతాలూ ఊడ్చుకుపోయి
ప్రతినిమిషం ఒక మొదలూ-చివరా ఉన్న
ప్రత్యేక జీవితంలాగా వెలిగింది.

వెలిగిన క్షణాలకు ముందు .... 

మొదటి జన్మలోని

బాల్య జీవితపు వాసనలు,
కర్మ వైఫల్య భయాలు
కరిగిపోవడం చూశాను.
ఏళ్ళకొద్దీ పాదుకుపోయిన సంప్రదాయపు
శృంఖలాలను తెగ్గొట్టలేక పడిన వేదనలు
కాలిపోవడం చూశాను.
ముల్లుల్లా గుచ్చుకుంటున్న
ఆశల ఆశయాల నాటకపు రంగ పాత్రలు
అదృశ్యమవడం చూశాను.

ప్రభాత వీచికల సుగంధం -
వర్ణశోభితమైన కొండ చరియ దర్శనం –
భాసిల్లిన గంగోత్రీ గానం -
సాకార ప్రతిపాదనలన్నీ నైరూప్యాలై
చివరికి మిగిలేది ఇదే ననడం చూశాను.

జన్మను ముగించుకున్నాను
అన్ని గతాలూ ఊడ్చుకుపోయి 
ప్రతి నిమిషమూ ఒక మొదలూ - చివరా ఉన్న 
రెండో జన్మనెత్తాను. 

No comments:

Post a Comment

P