Saturday, April 5, 2014

ప్రశ్నలోనే జవాబు ఉంది పిల్లలూ - చెప్పండి చూద్దాం.

కొత్తపల్లి ప్రచురణ

1.
ఉదయాన్నే లేచి తాగేదేమిటీ?

2.
పాదరక్షకు మరో పేరు చెప్పు?

3.
'రంపాన్ని' ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా?

4.
'స్టోన్' ని తెలుగులో ఏమంటారో రాయి!

5.
'ఫుట్' కి తెలుగు ఏమిటో నీ స్నేహితుడిని అడుగు!

6.
'మాత' అంటే ఏమిటో చెప్పమ్మా!

7.
'రా' ని తమిళంలో ఏమంటారో చెప్పగలవా?

8.
ధవళ వర్ణం అంటే ఏ రంగో తెలుపు ?!

9.
'కమ్' అంటే ఏమిటో చెప్పరా!

10.
'సెర్చ్' అనే పదానికి అర్థం ఏమిటో డిక్షనరీలో వెతుకు!




6 comments:

  1. 1. కాఫీ, పాలు, హార్లిక్సు, బోర్న్‌విటా, వగైరా
    2. పాదరక్ష - బూటు
    3. ఱంపం - tool used to cut hard material
    4. స్టోన్ - శిల, బండ
    5. ఫుట్ - పాదం
    6. మాత - తల్లి
    7. రా - డా (ఉదా. ఏరా అంటే ఎన్నడా, పోరా అంటే పోడా)
    8. ధవళము - ప్రకాశవంతము
    9. కం - హిందీలో అయితే తక్కువ; ఇంగ్లీష్‌లో (cum) అయితే మరియు
    10. వెతుకు - అన్వేషించు

    ReplyDelete
  2. కెకె గారూ, ప్రశ్నలోనే సమాధానం ఉంది చూడండి. ఒక్కటి కనిపెట్టారంటే మిగతావి ఈజీగా కనిపెట్టేయొచ్చు. ప్రయత్నించండి.

    ReplyDelete
  3. 1. టీ

    2. చెప్పు

    3. సా

    4. రాయి

    5. అడుగు

    6. అమ్మ

    7. వా

    8. తెలుపు

    9. రా

    10. వెతుకు

    ReplyDelete
  4. రాధగారు

    మీ తెలివైన ప్రశ్నలు, వాటిలోనే ఉన్న సమాధానాలు కనిపెట్టటం పిల్లలకోసం కదా. నేను పిల్లడిని కాదు కనుక, మీ ప్రశ్నలకి మీరూహించని వేరొక (సరియైన) సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించాను. అంతే తప్ప మీరనుకొన్న సమాధానాలు కనిపెట్టలేక కాదు. :-)

    ReplyDelete

P