Saturday, September 20, 2014

గుజ్జెనగూళ్ళు - 3



"రాధ నానీ! రాధ నానీ! నా కిష్టమైనవన్నీ 'లీ,లీ,లీ' లే" అంది సహస్ర.

“ఏమంటున్నావో నాకర్థం కాలేదు" అన్నాను.

“మరీ నా ముద్దు పేరేంటి?”

“ఖుషితల్లి"

“మన కుక్క పేరు, మా టీచర్ పేరూ?”

“చిల్లి, లిల్లి"

“మనింటికొచ్చి పాలు తాగుతోందే.... అదెవరు?”

“ఎవరూ...!?”

“మ్యావ్ అంటుందీ...?”

“పిల్లి"

“పూజశ్రీ నాకేమవుతుందీ?

“వదిన"

“వదిన కాదు చెల్లి"

“సరే అయితే. ఇంకా....”

నేను మంచి పనులు చేస్తే నువ్వు నన్నేమంటావూ....?”

“బంగారు తల్లి"

“చూడు.... అన్నీ 'లీ, లీ, లీ' లే కదా!”

“హ!హ!హ! .. అవును అన్నీ తెలుసు నా బుజ్జి తల్లికి"

"నానీ! బుజ్జితల్లి కూడా 'లీ' నే"


 "

*****

No comments:

Post a Comment

P