Thursday, September 18, 2014

గుజ్జెనగూళ్ళు - 1


గుజ్జెనగూళ్ళు - 1
*************

"రాధ నానీ! రాధ నానీ! రాము గురించి కథ రాశావు కదా!" అంది సహస్ర.

“అవును"

"సహస్ర గురించి ఒక కథ రాయవా"

"ఇదిగో రాశాను" అన్నాను.

“చెప్పు చెప్పు" అంది సహస్ర.

“సహస్ర ఒక మంచి పిల్లే ..... కాని ఎప్పుడూ గోల చేస్తుంటుంది. స్నానమే చేయదు కదా.... శుభ్రంగానే ఉండదు"

“ఏం కాదు నేను షుభ్రం...గా ఉంటాను.... అస్సలు గోల చేయను"

"ఎవ్వరూ చూడనప్పుడు వంటింట్లోకి వెళ్లి పాలు దొంగతనంగా తాగుతుంది"

“ఛీ... నానీ! అన్నీ అబద్దాలు చెప్తున్నావు"

“కొడితేనేమో "మ్యావ్" అంటూ పారిపోతుంది"

“ఇహిహి ఇహిహి"

నేను చెప్తుంది ఎవరి గురించో అర్థమై నవ్వుతోంది సిగ్గుగా....

***

No comments:

Post a Comment

P