కళ్ళు
తెరుపులు పడలేదోమో నదికి,
మత్తుగా
ఉంది. నిశ్శబ్ద
సంగీతం వినిపిస్తున్నట్లుంది
ఆకాశం వాలిపోయి తన్మయత్వంతో
నీలి రంగేసుకుంటోంది.
ఒడ్డున
కూర్చుని నేనూ చూస్తున్నాను
అక్కడేదో అద్భుతం పుడుతుందని....
ఊహు!
లాభం లేదని
బయలు దేరాను కొండల వెనకున్న
పొలాల మధ్యనుంచి నడుచుకుంటూ
శిఖరం మీదికి.
వ్యాలీ
అంతా పచ్చని చీర కట్టుకుని,
నేను చూశానో
లేదోనని ఎటో చూస్తున్నట్లు
నటిస్తూ తల ఎత్తి చూస్తోంది.
ఒక్కసారిగా
వాన! మనోదృశ్యంలో
ఉన్న నది నుండి నీరు ఆకాశంలోకి
ఎగిసిందేమో అన్నట్లుగా,
జల్లులు
జల్లులుగా కురుస్తూ,
నన్ను
తడిపేసింది.
అలాగే
కూర్చున్నాను పూర్తిగా
ముద్దయ్యేంత వరకూ,
పరవశంతో
మైమరిచి మెల్లమెల్లగా
నవ్వుకుంటూ.
నవ్వును
ఆపుకుని తిరిగొస్తుంటే ఇద్దరు
పిల్లలు మెత్తని మట్టిలో
ఇల్లు కడుతూ,
కట్టిన
ఇంటి పక్కన పారుతున్న నీటితో
నదిని చేసి దానిలో కాగితపు
పడవ వదులుతూ.
హఠాత్తుగా
కురిసిన వర్షం లాగే వచ్చిన
కలహంతో పోట్లాడుకుంటున్నారు.
విచారణలూ,
వార్నింగులూ
చేసిన నేను అయ్యో!
ఎలాగ ఇంత
చిన్న వయసులో ఇంత ఘోరంగా
కొట్లాడుకుంటున్నారే అని
దిగులు పడ్డాను రాత్రంతా.
తెల్లవారి
బడికెళుతూ భుజాల మీద చేతులేసుకుని
ఊసులాడుకుంటూ పిలుస్తున్నా
పలక్కుండా పోయే ఆ ఇద్దర్నీ
చూసి తెరలు తెరలుగా ఉబికి
ఉబికి వస్తున్న నవ్వుని ఎలా
ఆపుకోవడం?
అప్పుడు
కలిగింది నాకు అద్భుతం పుట్టిన
అనుభూతి.
*****
No comments:
Post a Comment
P