Monday, October 6, 2014

అతనితో స్నేహం

ఎన్నో సార్లు నీకు చెప్పాలి
మర్చిపోకుండా అనుకుంటాను
క్షణాల్లో మర్చిపోతాను

నీ స్వచ్ఛాత్మ భావాల వల్ల
పూర్తిగా సంపూర్తిగా
ఆనందామృత వర్షంలో
తడిసి ముద్దయిపోయానని

ప్రతిసారీ నిన్నడగాలి
తప్పకుండా అనుకుంటాను
మైమరుపులో పడిపోతాను

మెలకువకీ సుషుప్తికీ ఉన్న
మధ్య పొరని తాకినప్పుడు
మెరిసిన 'నేను' ని పట్టుకోమని
చెప్పింది నువ్వేనా అని

*****


Like

1 comment:

P