Saturday, October 11, 2014

గండభేరుండం

ఖండాంతరాలలో,
మెట్ల మధ్య క్రీనీడల్లో,
సర్రున జారిపోతున్న కార్ల టైర్ల రాపిడిలో,
విమానాల రెక్కలలో,
క్షిపణుల దిగుడు బావులలో
వాలి పోతున్న
ఆలోచనా గండభేరుండం.
అనేక ప్రదేశాలలో
ఒకేసారి
సంచరించాలన్న ఆతృత.
గడ్డు గా పెట్టుకున్న ముఖాలు -
భయాలూ, గర్వాలూ, బిడియాలూ
చెడ్డ అని ఏదైతే మనసు అనుకుంటోందో
అది జరగబోతున్న
వందలాది సంభావ్యతా వికల్పాల
యొక్క వలయపు ఝంఝ.
దాని వల్ల తృప్తి పడుతున్న
వెకిలి తనపు అంశ.
ప్రతి మాట లోనూ
సన్నివేశం లోనూ
రెక్కలు విదులుస్తున్న
అహంకారపు గండభేరుండం.
మొన్నటి కలలో
రెక్కలు విప్పి టపటపా కొట్టుకుంటూ
ఆకాశం లో కెగురుతోంది.
వివిధ ఫల పుష్ప వృక్ష జాతులతో కూడిన
దట్టమైన అరణ్యాలలో ఉన్నదేమిటో
కనుగొనాలని తిరుగాడుతోంది.


*****

No comments:

Post a Comment

P