Tuesday, October 21, 2014

ఏలనే!?

- రాధ మండువ
********
రాగాలతో కోకిలకి మత్తేల కలిగెనే
చల్లగాలికి చక్కిలిగింతలేలనే
ఊహలకి ఊరికే పయనమేలనే
రేయికి నిదురకై తపనేలనే

పచ్చదనాల చిలకమ్మకి
పచ్చని కొమ్మల మాటున దాపరికమేలనే
ఏకాంతవేళకున్న
ఏకాంతమేల దిగులు కలిగించెనే
తోడుకై ఎదురుచూపేలనే

మిశ్రమవర్ణ శోభిత శ్వేతానికి రంగులకై బాధేలనే
గగనాన్ని తాకాలని పుడమికి ఆరాటమేలనే
నిశ్శబ్ద సంగీతానికి మాటలేలనే
ప్రేమించే మనసుకి ప్రేమింపబడాలనే కోరికేలనే
******************************************



No comments:

Post a Comment

P